టీనేజర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన హరీశ్‌రావు

3 Jan, 2022 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో టీనేజర్లకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను  ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. తెలంగాణలో 22. 78 లక్షల మంది టీనేజర్లకు వాక్సిన్‌ అందించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4. 5 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పాజిటివిటీ రేటు 4 శాతం పెరిగిందని, బూస్టర్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని తెలిపారు.

ఈమధ్యనే కేంద్రం స్పందించిందని, కోవాగ్జిన్ టీకా పిల్లలకు వేస్తున్నామని చెప్పారు. 1014 సెంటర్లలో వాక్సిన్ వేస్తున్నాంమని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా 12 కార్పోరేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేస్తున్నామని తెలిపారు. గుమికూడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. జనవరి 10 నుండి 60 ఏళ్ల పై బడిన వారికి టీకాలు వేయనున్నామని చెప్పారు. కాలేజీలు, స్కూళ్ల ప్రిన్సిపాల్లకు  టీకాలు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు