ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు.. నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలి: హైకోర్టు

26 Nov, 2021 08:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐఏఎస్‌ బి.మృగేందర్‌లాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ఐఏఎస్‌ శిక్షణకు వెళ్లాల్సి ఉన్నందున హైకోర్టు 15 రోజుల తాత్కాలిక ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
చదవండి: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్‌ కేసు

మృగేందర్‌లాల్‌ దర్యాప్తునకు సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలని, లేకపోతే ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు అధికారి పిటిషన్‌ దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్‌ 9కి హైకోర్టు వాయిదా వేసింది. మృగేందర్‌లాల్‌ 2019 డిసెంబర్‌ 25న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
చదవండి: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్‌ ఎందుకు?

మరిన్ని వార్తలు