హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు

16 Jun, 2021 21:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. ఈ సందర్భంగా అపెక్స్‌ కౌన్సిల్‌ అజారుద్దీన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పు పట్టింది. కాగా అజార్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండడంతో హెచ్‌సీఏ సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

చదవండి: క్రౌడ్‌ ఫండింగ్‌... సేవా ట్రెండింగ్‌

మరిన్ని వార్తలు