హెచ్‌సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్‌

5 Jul, 2021 12:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (హెచ్‌సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్‌ జింఖానా వద్ద హెటెన్షన్‌ నెలకొంది. హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రెస్‌మీట్‌కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తామని అపెక్స్‌ కౌన్సిల్‌ అంటోంది. అంబుడ్స్‌మెన్‌ ప్రకటనపై అపెక్స్‌ కౌన్సిల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అజార్‌ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్‌ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్‌ గ్రూప్‌, జాన్‌ మనోజ్‌ గ్రూప్‌లను పోలీసులు అడ్డుకుంటున్నారు.

హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌కు అంబుడ్స్‌మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయంపై మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌  అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్‌కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్‌ మనోజ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ ఫిర్యాదు మేరకు అంబుడ్స్‌మన్ దీపక్‌ వర్మ అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు.

తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్‌మన్‌ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్‌మన్‌గా దీపక్‌ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్‌వర్మకు లేదని పేర్కొంది. దీపక్‌వర్మ నియామకమే చెల్లదని అపెక్స్‌ కౌన్సిల్ అంటోంది.
 

మరిన్ని వార్తలు