డీఎన్‌ఏ వెలికితీతకు కొత్త కిట్‌ 

1 May, 2021 09:07 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌/రాయదుర్గం: మానవులతో పాటు జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల నుంచి డీఎన్‌ఏను సులువుగా వేరు చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలోని అస్పైర్‌ బయోనెస్ట్‌లో పనిచేస్తున్న 30 ఎం జీనోమిక్స్‌ స్టార్టప్‌ కంపెనీ వినూత్నమైన కిట్‌ను అభివృద్ధి చేసింది. యాంప్‌రెడీ అని పిలుస్తున్న ఈ కొత్త కిట్‌.. ఇతర పరికరాలేవీ ఉపయోగించకుండానే 5సెకన్లలోనే డీఎన్‌ఏను వేరుచేయగలదు.

డీఎన్‌ఏ ఆధారిత పరీక్షలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అతి తక్కువ నమూనా ద్వారానే డీఎన్‌ఏను వెలికితీయొచ్చని 30ఎం జీనోమిక్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని ప్రధాన పరిశోధన సంస్థలు యాంప్‌రెడీ పనితీరును ధ్రువీకరించాయని సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బెన్నెట్‌ దాస్, పీఎస్‌కేఎన్‌ పావని, యశ్వంత్‌రెడ్డి తెలిపారు.
చదవండి: గవర్నర్‌ తమిళిసైకి ఇందిరా శోభన్‌ లేఖ

మరిన్ని వార్తలు