లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి విలవిలలాడిన సెక్యూరిటీ గార్డు

17 Jan, 2024 13:54 IST|Sakshi

నిజామాబాద్: కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లో దారుణం చోటుచేసుకుంది..  కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో బుధవారం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయి రెండు కాళ్లు బయట బాడీ లోపల ఉండిపోవడంతో గంటకు పైగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడు. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మహేందర్ గౌడ్ రెండు కాళ్ళు బయట..బాడీ లిఫ్ట్ లో ఇరుక్కుపోడంతో కాళ్లు చేతులు విరిగి కొన ఊపిరి ఉండడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు