ట్రైనింగ్‌ విద్యార్థిని.. రికార్డులపై సంతకాలు కావాలంటే ఇంటికి రావాలంటూ..

7 Apr, 2022 12:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విద్యార్థిని

హెచ్‌ఎంపై విద్యార్థిని బంధువుల దాడి?

సాక్షి,సూర్యాపేటటౌన్‌: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది గురువులు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ కోసం వచ్చిన బీఈడీ విద్యార్థినిని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని బుధవారం డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విష­యం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విద్యార్థిని సూర్యాపేట సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఈడీ చదువుతోంది. బీఈడీ టీచింగ్‌ ట్రైనింగ్‌లో భాగంగా  20­రోజులుగా జిల్లా కేంద్రంలోని నంబర్‌ 2 ప్రభు­త్వ పాఠశాలకు వస్తోంది. ట్రైనింగ్‌ పూర్తవ్వడంతో çసంబంధిత పాఠశాల హెచ్‌ఎం ట్రైనింగ్‌ పూర్తిచేసినట్లు రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.

అయి­తే సదరు విద్యార్థిని రెండు మూడు సార్లు హెచ్‌ఎం దగ్గరకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌­లో సంప్రదించింది. తన రికార్డులపై సంతకాలు చేయాలని కోరగా ఇంటికి వస్తే గాని సంతకాలు చేయనని హెచ్‌ఎం ఫోన్‌లోనే అసభ్యంగా మాట్లాడినట్లు ఆ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రైనింగ్‌కు వచ్చిన దగ్గర నుంచి హెచ్‌ఎం తనను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తెలిపింది.

హెచ్‌ఎంపై దాడి..?
హెచ్‌ఎం చేష్టలకు విసిగిపోయిన సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో వారు హెచ్‌ఎంపై దాడి చేసినట్లు సమాచా­రం. హెచ్‌ఎంపై దాడి చేసి అక్కడ నుంచి వచ్చి డీఈ­ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హెచ్‌ఎంపై బీఈడీ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత హెచ్‌ఎంపై విచారణ చేపట్టి.. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం.
–అశోక్, డీఈఓ

చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి..

మరిన్ని వార్తలు