జల దిగ్బంధంలో మేడారం

15 Aug, 2020 16:24 IST|Sakshi

సాక్షి, ములుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో మొదటిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకాయి. ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది.

మరిన్ని వార్తలు