హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. రెడ్‌ అలర్ట్‌

27 Sep, 2023 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా ఈదురుగాలులతో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉండి సాయంత్రం 5 గంటల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. 

నగరంలోని నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, మాసబ్‌ ట్యాంక్‌, లక్డీకపూల్‌, గోషామహల్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, అప్జల్‌గంజ్‌, హబీబ్‌నగర్‌ సహా పలు ప్రాంతాల్లో భారవ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వర్షం కారణంగా వినాయక నిమజ్జనాలకు వెళ్లున్న భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు