భారీ వర్షాలు.. పానీపూరి తినడానికి వెళ్లి!

15 Oct, 2020 14:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంగళవారం నగరంలో కురిసిన కుండపోత వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జన జీవనం అతలాకుతలమైంది. వదరలో వాహనాలు కొట్టుకుపోగా కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్  వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిని తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వేలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. చదవండి: ఇంకా వీడని అంధకారం..

మరోవైపు నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలతో ఏర్పడిన వరదలో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు. విధులు ముగించుకుని బండ్లగూడా మల్లికార్జున నగర్‌లోని ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా నీళ్లలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తు 48 గంటలు తర్వాత సందర్‌ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. చదవండి: హైదరాబాద్‌ సీపీ ఇంట్లోకి వరదనీరు

మరిన్ని వార్తలు