హైదరాబాద్‌పై కమ్ముకున్న మేఘాలు.. ఉరుములతో భారీ వర్షం

18 Mar, 2023 17:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన సైతం కురిసింది. దీంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక, శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాలో వడగండ్లతో భారీ వర్షం కురిసింది. 

అటు, హైదరాబాద్‌లో కూడా శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, ఉరుములతో కూడిన వడగండ్ల వర్షం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌ నగర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇక, జగిత్యాల జిల్లా భీమారంలో వడగండ్ల వాన దంచికొట్టింది.కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ సందర్భంగా ఈదురు గాలుల తాకిడితో పలు రేకుల షేడ్లు ధ్వంసమయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో వర్ష బీభత్సం నెలకొంది. గంగాధర మండల కేంద్రంలో వడగండ్ల వాన కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. ఇక, ఏపీలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు