జీహెచ్ఎమ్‌సీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  భారీ వర్షం

19 May, 2021 23:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎమ్‌సీ పరిధిలోని పలు ప్రాంతాల్లో  భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులతో వర్షం దంచికొడుతుంది. చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్ పంజాగుట్ట, యూసుఫ్ గూడా, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, కొండాపూర్‌లో భారీ వర్షం పడుతుంది. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. నారాయణ పేట జిల్లా మాగానూర్ లో 4.6సెంమీ, నారాయణ పేట లో 3సెంమీ,మహబూబాబాద్ జిల్లా గార్లలో 2.6సెంమీ  వర్షపాతం నమోదయ్యింది.

మరిన్ని వార్తలు