‘మమ్మల్ని బురదలో బొంద పెట్టండి మేడమ్‌’

27 Jul, 2021 08:08 IST|Sakshi
మొరపెట్టుకుంటున్న ఎస్సీ కాలనీవాసులు

సాక్షి, రామగుండం(కరీంనగర్‌): ‘మాకు పునరావాసమైనా కల్పించండి లేకుంటే.. ఓబీ మట్టి కుప్పల బురదలో మమ్మల్ని బొందపెట్టండి..’ అంటూ అంతర్గాం మండల పరిధి లోని మేడిపల్లి ఓపెన్‌కాస్టు ప్రభావిత గ్రామమైన లింగాపూర్‌ ఎస్సీ కాలనీవాసులు కలెక్టర్‌ సంగీత ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాలనీకి సమీపంలో ఉన్న ఓ బీ కుప్పలతో భయంభయంగా కాలం వెల్లదీస్తున్నామని, ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు బురద నీరంతా కాలనీని చుట్టుముడుతోందని, అక్కడ జీవనం సాగించలేకపోతున్నామని పేర్కొన్నారు.

ఇప్పటికే సింగరేణి యాజమాన్యం తమ కాలనీని సందర్శించి త్రీమెన్‌ కమిటీతో అందించే పరిహారం, సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించేందుకు కొంతపరిహారం అందించినా.. పూర్తిస్థాయిలో చేయలేదని పేర్కొన్నారు. ఓపెన్‌కాస్టు జీవితకాలం పూర్తవడంతో తమకు పరిహారం చెల్లించకుండానే ముఖం చాటేసే అవకాశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. పదకొండేళ్లుగా బురదతో కాలం వెల్లదీస్తున్నామ ని తెలిపారు. తమకు సింగరేణి ఇచ్చిన హామీ ప్రకా రం పునరావాస ప్యాకేజీ, నివేశన స్థలాలు పంపిణీ చే సి ఆదుకోవాలని లింగాపూర్‌ మాజీ సర్పంచ్‌ ఇరికిళ్ల శంకరయ్య, మాజీ ఎంపీటీసీ ఇరికిళ్ల పద్మ, కాలనీవాసులు కోరారు.   

మరిన్ని వార్తలు