హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం

26 May, 2022 16:26 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ :  హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో గురువారం మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం కురిసింది. పలుచోట్ల భారీగా ఈదురుగాలులు వీశాయి రాళ్ల వర్షం కురిసింది. ప‌శ్చిమ హైద‌రాబాద్ ప్రాంత‌మంతా మేఘాలు క‌మ్ముకున్నాయి.గ‌చ్చిబౌలి, హెచ్‌సీయూ, తెల్లాపూర్, నార్సింగి, మ‌ణికొండ‌, బంజారాహిల్స్‌, పుప్పాలగూడ, రాజేంద్రనగర్‌, హైదర్‌గూడ, అత్తాపూర్‌, గండిపేట‌తో పాటు స‌మీప ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

గాలి దూమరానికి నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుప రేకులు కొట్టుకు వచ్చాయి. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వసం అవ్వగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బండ్ల‌గూడ జాగీర్ మున్సిపాలిటీ ఏరియాలో చాలా రోజుల త‌ర్వాత కుండ‌పోత వ‌ర్షం ప‌డింది. 
చదవండి: Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం

మరిన్ని వార్తలు