హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. మరో మూడు రోజులు భారీ వర్షం!

4 Sep, 2021 21:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్‌ ముసారాంబాగ్‌ బ్రిడ్జ్‌ నీటమునిగింది. అంబార్‌పేటలోని బాపూనగర్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. అంబర్‌పేట-ముసారాంబాగ్‌ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్‌ సరిసరాలు జలమయం అయ్యాయి. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. గండిపేట చెరువుకు భారీగా వరద, ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

రానున్న మూడు రోజులు హైదరాబాదలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్‌, మాన్సూన్‌ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోని బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో వాన పడింది. ఎస్‌ఆర్‌ నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర​, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం నీటీతో రహదారులు జలమయం అయ్యాయి.  

చదవండి: హైదరాబాద్‌లో ఈ ఏడాది నిమజ్జన చెరువులు ఇవే.. 

మరిన్ని వార్తలు