హైదరాబాదీలను హడలెత్తిస్తున్న వర్షం

19 Sep, 2020 18:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్‌, వనస్థలీపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌ మేట్‌, దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, సరూర్ నగర్, కర్మన్‌ఘాట్,  కొత్తపేట్, మీర్‌పేట్, కీసర, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, నాగారం, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.  (ఉసురు తీసిన నాలా)

అనేకచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు ఇప్పటివరకూ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు 38 ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచించారు. ముఖ్యంగా ఎల్బీ నగర్,కూకట్ పల్లి జోన్లులో అధికంగా వర్షం అవకాశం ఉండటంతో సిబ్బంది మరింత అలెర్ట్ గా ఉండాలని లోకేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు