హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. నగరవాసులకు అలర్ట్‌

5 Aug, 2022 08:04 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. వర్షంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఇక్కట్లు తలెత్తాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

ఎగువ ప్రాంతాల్లో తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలతోపాటు మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్‌ జలాశయంలోనికి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఆరు గేట్లను ..నాలుగు అడుగుల మేర తెరచి 2328 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. హిమాయత్‌సాగర్‌లోనికి 2500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..నాలుగు గేట్లను రెండు అడుగుల మేర తెరచి 2532 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది.


చదవండి: ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్‌!

మరిన్ని వార్తలు