MMTS Train Cancel News: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 34 ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

14 Jul, 2022 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్‌– లింగంపల్లి, ఫలక్‌నుమా– లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌– లింగంపల్లి, లింగంపల్లి– సికింద్రాబాద్‌ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి.


మరో మూడు రోజులు వర్షసూచన 

మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా శేరిలింగంపల్లి, మాదాపూర్‌లలో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది.   


అభివృద్ధి పనులను పరిశీలించిన అర్వింద్‌కుమార్‌
 
గండిపేట్‌ వద్ద హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంఫీ థియేటర్, రెస్టారెంట్, పలు అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రకృతి రమణీయత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సిటీజన్లకు చక్కటి ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. (క్లిక్‌: హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ)

మరిన్ని వార్తలు