వీడని వాన

11 Aug, 2020 07:43 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో వరుసగా రెండోరోజైన సోమవారం కూడా నగరంలో ముసురు పట్టింది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటమునిగాయి. రహదారులపై వాహనాలు వర్షపునీటిలో ఈదుకుంటూ భారంగా ముందుకు కదిలాయి.

సరాసరిన నగర వ్యాప్తంగా 2.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతోపాటు దీనికి అనుబంధంగా 2.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రాగల 48 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఒకవైపు కోవిడ్‌ కేసులు పెరుగుతోన్న తరుణంలోనే రెండురోజులుగా ముసురు పడుతుండటంతో సిటీజనులు ఆందోళన చెందుతున్నారు. పలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చినవారు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు.  

మరిన్ని వార్తలు