Nehru Zoo Park Hyderabad: జూలోకి వరద నీరు.. లయన్‌ సఫారీ మూసివేత

13 Jul, 2022 11:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీరాలం ట్యాంక్‌ ఓవర్‌ ఫ్లో కారణంగా వరదనీరు జూపార్కులోకి ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో జూ అధికారులు వర్షపు నీరు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్‌ సఫారీలోని వన్యప్రాణులను నైట్‌ ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు. 

సందర్శకులు లయన్‌ సఫారీ వైపు వెళ్లకుండా సందర్శనను పూర్తిగా మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. (క్లిక్‌: హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు.. జీహెచ్‌ఎంసీ అలర్ట్‌)

మంచినీటి సరఫరా యథాతథం 
కృష్ణా ఫేజ్‌–1 జంక్షన్‌ మరమ్మతు పనులు వాయిదా వేయడంతో బుధవారం హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటిసరఫరా జరగనుందని జలమండలి ప్రకటించింది. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించిన విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. (క్లిక్‌: హైదరాబాద్‌ లో అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?)

మరిన్ని వార్తలు