జలదిగ్బంధంలో భైంసా పట్టణం

22 Jul, 2021 16:32 IST|Sakshi

నిర్మల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల ధాటికి భైంసా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తోంది. వరద తీవ్రత ఎక్కువ కావడంతో భైంసా పట్టణం ఆటోనగర్‌లోని 60 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి.


ఈ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరన్‌ రెడ్డి పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా రెస్క్యూ టీం నాటు పడవలతో  సహాయక చర్యలు ప్రారంభించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురువడంతో.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. గ్రామాల్లో మురుగుకాల్వలు, ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.


 


 

మరిన్ని వార్తలు