హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌

8 Oct, 2022 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రబాద్‌, ఖైరతాబాద్‌ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

అత్యధికంగా మదాపూర్‌లో 7.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన క్రమంలో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి.

మరిన్ని వార్తలు