నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్‌ ఛేంజర్‌’ గా కనిపించిన హీరో రాంచరణ్‌..

26 Aug, 2023 11:08 IST|Sakshi

నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్‌ రైస్‌ గోదాములో హీరో రాంచరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజ్‌ నిర్మాతగా ఎస్‌వీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది.

మరిన్ని వార్తలు