ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌కు చుక్కెదురు.. హైకోర్టు కీలక తీర్పు

2 Jan, 2023 15:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌కు చుక్కెదురైంది. ప్రభుత్వ రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ కోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసింది. కేసులో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్‌ మోమో జారీ చేసిన సంగతి తెలిసిందే..

కాగా, బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌, శ్రీనివాస్‌లపై మెమో విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు  దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్‌లో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనిని విచారిస్తున్న సిట్‌గానీ, దర్యాప్తు అధికారిగానీ ఇక ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్‌ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


చదవండి: కావాలనే అలా మాట్లాడా! నేరం ఒప్పుకోలు.. భైరి నరేష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు

మరిన్ని వార్తలు