MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?

30 Nov, 2022 17:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం.. పోలీసు శాఖతో సిట్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ 41ఏ సీఆర్‌పీసీ ​కింద నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టు ఆశ్రయించి ఊరట పొందారు. 

తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి.

విచారణ సందర్భంగా..
బీజేపీ తరఫున మహేష్‌ జఠ్మలానీ..
- సిట్‌పై మాకు నమ్మకం లేదు. 
- సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. 

సిట్‌ తరఫున దుష్యంత్‌ దవే..
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తీవ్రమైన నేరం. 
- బీజేపీకి సంబంధం లేదంటారు.. నిందుతల తరఫున కేసులు వేస్తారు. 
- బీజేపీ అనేక చోట్ల ప్రభుత్వాలను పడగొట్టింది. 
- తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా కుట్ర జరిగింది. 
- ఎమ్మెల్యేల కొనుగోలుపై పక్కా ఆధారాలున్నాయన్నారు. 

ఇక, అంతుకుముందు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని కామెంట్స్‌ చేశారు. దీంతో, కోర్టు విచారణనున రేపటి(గురువారాని)కి వాయిదా వేసింది. 
 

మరిన్ని వార్తలు