Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌.. ఏజీకి హైకోర్టు కీలక ఆదేశాలు!

9 Jan, 2023 13:34 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, మాస్టర్‌ప్లాన్‌పై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

కాగా, రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. రైతుల తరఫున న్యాయవాది సృజన్‌ రెడ్డి.. మాస్టర్‌ ప్లాన్‌ను కోర్టుకు సమర్పించారు. రైతులను పక్కనపెట్టి రీక్రియేషన్‌ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. దీంతో​, మాస్టర్‌ ప్లాన్‌పై ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించాలని హైకోర్టు ఆదేశించింది. తర్వాత పిటిషన్‌ను హైకోర్టు పాస్‌ ఓవర్‌ చేసింది. 

మరిన్ని వార్తలు