పోలీసుల అత్యుత్సాహం.. హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి..

10 Jul, 2023 11:25 IST|Sakshi

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మలక్‌పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అనంతరం  అడ్వకేట్  ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపూరి సుభాష్ రెడ్డి(75)ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గూడూరులో ఉన్న ఎన్ఆర్ఐకు చెందిన  5 ఎకరాల భూమిని స్థానిక రియల్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కాసి రామ్ కొనేందుకు కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు. 

కుట్రలో భాగంగానే  ఎన్ఆర్ఐని పలుమార్లు పీఎస్ కు పిలిపించి పోలీసులు బెదిరించారని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆరోపించారు. మాట వినకపోవడంతో గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రానా ప్రతాప్.. ఎన్‌ఆర్‌ఐని అక్రమంగా అరెస్టు చేసేందుకు యత్నించాడని తెలిపారు. ఈ క్రమంలో గూడూరు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే  అరెస్ట్ చేసేందుకు ఇంటిపై దాడి చేశారని  అడ్వకేట్ చెప్పారు. గట్టిగా ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారని అన్నారు. ఈ ఘటనపై రేపు డీజీపీకి, హైకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు అడ్వకేట్  రాపోలు భాస్కర్ తెలిపారు. 

నిందితునికి ఆశ్రయం కల్పించడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించాడని పోలీసుల మలక్‌పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ ఐ రాణా ప్రతాప్ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శామ్‌ కోషీ!

మరిన్ని వార్తలు