భూ సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను నిలిపివేసిన హైకోర్టు

3 Sep, 2022 07:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌లో జీవో నంబర్‌ 35ను పేర్కొనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మలన్నసాగర్‌ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం 102.13 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మలన్నసాగర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే దీని నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 8 గ్రామాల ప్రజలకు పునరావాసం కింద డబుల్‌ బెడ్‌రూమ్‌ల గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 102.13 ఎకరాలను సేకరించేందుకు 2021, జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో జీవో 35ను ఇందులో చేర్చింది.

ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ సిద్దిపేట్‌ జిల్లా గజ్వేల్‌ మండలం ముత్రాజ్‌పల్లికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నోటిఫికేషన్‌లో జీవో 35ను పేర్కొనడం చట్టవిరుద్ధమని చెప్పారు. నీటి ప్రాజెక్టులు, కాలువలు, స్పిల్‌వే.. లాంటి సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిపే భూసేకరణకు మాత్రమే ఈ జీవోను వినియోగించాలి వెల్లడించారు. కానీ, ప్రభుత్వం ఫుడ్‌ సెక్యూరిటీ సర్వే, గ్రామ సభల ఆమోదం నుంచి తప్పించుకునేందుకు ఇళ్ల నిర్మాణం కోసం చేసే భూసేకరణలో ఈ జీవోను ఇచి్చందన్నారు. ఇళ్ల నిర్మాణానికి సరిపడా ప్రభుత్వ భూమి ఉన్నా.. సేకరిస్తున్నారని నివేదించారు. జీవో నం.35 ఈ నోటిఫికేషన్‌కు వర్తించదన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు 

మరిన్ని వార్తలు