సమగ్ర యాజమాన్యంతో అధిక  దిగుబడి

24 Sep, 2022 02:08 IST|Sakshi
మాట్లాడుతున్న శాస్త్రవేత్త శ్రీదేవి 

సిద్దిపేటరూరల్‌: సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల పరిశోధ స్థానం శాస్త్రవేత్తలు అన్నారు. తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌లో ఉత్తమ సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ నిర్వహించారు. శాస్త్రవేత్త, హెడ్‌ డా.ఎస్‌.శ్రీదేవి   వ్యవసాయ, ఉద్యాన పంటల్లో పోషకాలపై వివరించారు.

పంటల్లో చీడపీడల నివారణకు రసాయన మందులను కాకుండా సేంద్రియ మందులు వాడాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చీడపీడలను నివారించుకునేందుకు దీపపు ఎరలు, లింగాకర్షణ బుట్టలు, జిగురు పూసిన ఎరలను వాటి ప్రాముఖ్యతను వివరించారు. పంటల్లో ఎలా అమర్చుకోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయినాథ్, ఎ.సరిత, ఉమారాణి, శ్వేత, డా.పల్లవి, ప్రొఫెసర్‌ సతీష్, సర్పంచ్, ఆర్‌.ఎస్‌.ఎస్‌ కోఆర్డినేటర్‌ కె.నగేష్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు