హైదరాబాద్‌ చేరుకున్న ‘ఫ్లయింగ్‌ రాబిట్స్‌’ 

5 Dec, 2022 01:42 IST|Sakshi

17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనున్న సాహస బృందం  

సాక్షి, హైదరాబాద్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌ రీయూనియన్‌ వేడుకల్లో భాగంగా నవంబర్‌ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్‌ ఎక్స్‌పెడిషన్‌ బృందం ఆదివారం హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్‌ రాబిట్స్‌’­బృందంతో గయలోని నోడల్‌ సెంటర్‌ (మైక్రోలైట్‌) ఆర్మీ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు.

ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమా­నాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహా­­రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్‌కు చేరిన ఫ్లయింగ్‌ రాబిట్స్‌ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు