Sunday Funday: సండే-ఫండే’లో స్టాల్‌ పెడతారా? 

14 Oct, 2021 09:07 IST|Sakshi

అయితే.. దరఖాస్తు చేసుకోండి  

సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సండే-ఫండేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు ఎందరో ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో సండే-ఫండే సందర్భంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు.. ముఖ్యంగా హస్తకళలు, చేనేత సంబంధిత, ఈటరీస్‌ తదితర స్టాళ్ల ఏర్పాటుకు  దరఖాస్తు చేసుకోవాల్సిందిగా హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.

స్టాళ్లలో ఉంచే ఉత్పత్తులు, ధరలతోపాటు సంప్రదించాల్సిన వారి వివరాలు తదితరమైనవి ea2ps-maud @telangana.gov.in మరియు hcip hmda@gmail.com చిరునామాలకు  మెయిల్‌ చేయాల్సిందిగా పేర్కొంది. లేదా హెచ్‌ఎండీఏ బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ప్రతి సోమ, మంగళ వారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లిఖిత పూర్వక విజ్ఞప్తిని అందజేయవచ్చని సూచించింది.

లాటరీ ద్వారా ఎంపిక చేసినవారికి నామమాత్రపు ఫీజుతో రెండు వారాల పాటు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. అందరికీ సమాన అవకాశం కల్పించేందుకు కేటగిరీల వారీగా లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దీంతోపాటు  స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు  సంగీతం తదితర  కళారూపాలను  ప్రదర్శించాలనుకునే వ్యక్తులు, గ్రూపులు సైతం  దరఖాస్తు చేసుకోవచ్చని హెచ్‌ఎండీఏ పేర్కొంది.

మరిన్ని వార్తలు