గాలి నుంచి ఆక్సిజన్‌ వచ్చేదెలా?

30 Sep, 2021 03:03 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: భూమ్మీద జీవులకు ఆక్సిజనే కీలకం. ఆక్సిజన్‌ అందకుండా కొన్ని నిమిషాల పాటు కూడా బతకలేం. మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను సంగ్రహించి, శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్‌ డయాక్సైడ్‌ను వదిలేస్తుంటాం. కానీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు.. శరీరానికి ఆక్సిజన్‌ సరిగా అందక, ప్రత్యేకంగా అందించాల్సి వస్తుంది. గాలిలో ఆక్సిజన్‌ ఉండగా మళ్లీ ఎందుకు అందించడం అనే సందేహాలు రావొచ్చు. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 0.9శాతం ఆర్గాన్, మిగతా 0.1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 21%ఆక్సిజన్‌నే గ్రహించాల్సి ఉంటుంది. అదే 90 శాతానికిపైగా ఆక్సిజన్‌ ఉంటే.. మరింత మెరుగ్గా శరీరానికి అందుతుంది. శ్వాస సరిగా ఆడనివారికి ఆక్సిజన్‌ పెట్టడానికి కారణమిదే.

సాధారణ గాలిలో నుంచి నైట్రోజన్‌ వాయువును తొలగించేస్తే.. మిగిలే గాలిలో 90 శాతానికిపైగా ఆక్సిజన్‌ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంట్లు ఇదే పనిచేస్తాయి. ఈ సాంకేతికతను ‘ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌ (పీఎస్‌ఏ)’గా పిలుస్తారు. 

పీఎస్‌ఏ ప్లాంట్లు పనిచేసేదిలా..
1.    సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరిస్తారు. 
2.    గాలిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. అందులో తేమను తొలగిస్తారు. 
3.    దుమ్ము, ధూళి లేకుండా ఫిల్టర్‌ చేస్తారు. 
4.    ఒక చిన్నపాటి ట్యాంకు (ఎయిర్‌ బఫర్‌) మీ దుగా అడ్సార్‌ప్షన్‌ ట్యాంకులకు పంపుతారు. 
5.    అడ్సార్‌ప్షన్‌ స్టేజీలో రెండు ట్యాంకులు ఉంటాయి. వాటిల్లో జియోలైట్‌గా పిలిచే ప్ర త్యేక పదార్థాన్ని నింపి ఉంచుతారు. వేర్వేరు వాయువులను పీల్చుకునేందుకు వేర్వేరు జియోలైట్లు ఉంటాయి. నైట్రోజన్‌ను పీల్చేం దుకు ‘జియోలైట్‌ 13’ను వాడుతారు. ముం దుగా ఒక ట్యాంకు (ఏ)లోకి తీవ్ర ఒత్తిడితో ఉన్న గాలిని పంపుతారు. అందులోని జియోలైట్‌ నైట్రోజన్‌ను పీల్చుకుంటుంది. 93–95 శాతం ఆక్సిజన్‌తో కూడి న గాలి మిగులుతుంది. దీనిని ఆక్సిజన్‌ ట్యాంకుకు పంపుతారు. తర్వాత ట్యాంకు (ఏ)లో నుంచి వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. ఇదే సమయంలో మరో ట్యాంకు (బి)లో నైట్రోజన్‌ పీల్చుకునే ప్రాసెస్‌ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత మ రో ట్యాంకులో ఉత్పత్తవుతూ ఉండటం వల్ల.. నిరంతరంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుంది. 
6.    ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వార్డులకు సరఫరా చేస్తారు. 7. వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు.     

మరిన్ని వార్తలు