వర్షం ఎంత కురిసింది ఎలా లెక్కిస్తారో తెలుసా?

16 Jul, 2021 02:23 IST|Sakshi
రెయిన​ గేజ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కోసారి కాస్త వాన పడుతుంది.. ఒక్కోసారి కుండ పోతగా కురుస్తుంది. అధికారులేమో.. పది సెంటీమీటర్లు పడింది.. 15 సెంటీమీటర్లు పడింది అని చెప్తుంటారు. మరి ఈ లెక్కలు ఎలా తీస్తారో తెలుసా..? ఇందుకు వాడేది రెయిన్‌ గేజ్‌గా పిలిచే ఓ చిన్నపాటి పరికరమే. ఓ చిన్నపాటి గాజు సీసా, దాని లోపలికి ఉండే ఓ గాజు గరాటు, దానిపై ఉండే మిల్లీమీటర్, సెంటీమీటర్ల కొలతలు.. అంతే. నిర్దిష్ట ప్రదేశాల్లో, నిర్ణీత ఎత్తులో ఈ రెయిన్‌ గేజ్‌లను ఏర్పాటు చేస్తారు.

వాన కురిసినప్పుడు పైన ఉన్న గరాటు ద్వారా గాజు సీసాలోకి నీళ్లు చేరుతాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే.. అన్ని సెంటీమీటర్లు/ మిల్లీమీటర్లు వాన పడిందన్న మాట. చెట్లు, భవనాలకు సమీపంలో, అటూఇటూ గాలి మళ్లేలా ఉన్న ఎగుడు దిగుడు ప్రదేశాల్లో రెయిన్‌ గేజ్‌లను ఏర్పాటు చేస్తే తప్పుడు లెక్కలు వస్తాయి. అందుకే విమానాశ్రయం వంటి విశాలమైన, చుట్టూ ఖాళీ ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు