69 జీఓను రద్దు చేయాలి: పలు సంఘాల సంయుక్త ప్రకటన 

30 Jun, 2022 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 69 జీఓను తక్షణం రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 84 గ్రామాల పరిధిలో పట్టణీకరణ కోసం జారీచేసిన తాజా జీఓతో జంట జలాశయాలు మురుగు కాల్వల్లా మారతాయని ఆక్షేపించారు. నగర జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని, తాగునీటి అవసరం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. 

పట్టణీకరణ వల్ల వర్షపునీటి ప్రవాహానికి అడ్డంకులు తలెత్తి వరదల ఉద్ధృతి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బాల్‌రాజ్, తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, డబ్ల్యూఐసీసీఐ అధ్యక్షుడు లుబ్నాసర్వత్, సిటిజన్స్‌ ఫర్‌ హైదరాబాద్‌ ప్రతినిధి కాజల్‌ మహేశ్వరి, ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌ ప్రతినిధి ఫరిహా ఫాతిమా, అనన్య సంగమేశ్వర్‌లున్నారు. (క్లిక్‌: హైదరాబాద్‌ కలెక్టర్‌గా అమయ్‌కుమార్‌)

మరిన్ని వార్తలు