‘సాక్షి’కి అవార్డుల పంట

31 Jan, 2021 05:51 IST|Sakshi

గచ్చిబౌలి (హైదరాబాద్‌): ‘సాక్షి’ గ్రూప్‌ ప్రతినిధులకు అవార్డుల పంట పండింది. హైబిజ్‌ టీవీ శనివారం అందించిన మీడియా అవార్డులలో ‘సాక్షి’ ప్రతినిధులకు ఎక్కువ అవార్డులు లభించాయి. జర్నలిజం విభాగంలో పొలిటికల్‌ బెస్ట్‌ రిపోర్టర్‌గా పి.ఆంజనేయులు, బెస్ట్‌ బిజినెస్‌ రిపోర్టర్‌గా ఎన్‌.మహేందర్‌ కుమార్, బెస్ట్‌ క్రైం రిపోర్టర్‌గా శ్రీరంగం, సర్క్యులేషన్‌ విభాగంలో బెస్ట్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సేల్స్‌ శ్రీకాంత్, బెస్ట్‌ ఇన్నోవేషన్‌గా ప్రదీప్‌ బట్టు, ఏడీవీటీ విభాగంలో బెస్ట్‌ ఇన్నోవేషన్‌గా ఎం.మహేందర్‌ కుమార్, బెస్ట్‌ ఈవెంట్స్‌గా జి.నాగరాజుగౌడ్, మధుపాపరావు, బెస్ట్‌ గ్రోత్‌గా ఎం.వినోద్‌ కుమార్, ఎల్రక్టానిక్‌ మీడియా విభాగంలో బిజినెస్‌ బెస్ట్‌ రిపోర్టర్‌గా ఆర్‌.రాజ్‌ కుమార్, ఏడీవీటీ విభాగంలో బెస్ట్‌ ఇన్నోవేషన్‌గా జె.గోవర్దన్‌రావు, కోవిడ్‌ సమయంలో పనిచేసిన టీవీ రిపోర్టర్‌ విక్రమ్‌ స్పెషల్‌ అవార్డులను అందుకున్నారు.

కోవిడ్‌తో మృతి చెందిన సాక్షి జర్నలిస్ట్‌ వెంకటేశ్వరరావు, మరో జర్నలిస్ట్‌ మనోజ్‌ కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జర్నలిజం, అడ్వర్టైజింగ్, సర్క్యులేషన్‌ విభాగంలో పనిచేసిన వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులకు ‘మీడియా అవార్డులు–2021’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హైబిజ్‌ టీవీ ఎండీ రాజ్‌గోపాల్, సాక్షి ఏడీవీటీ డైరెక్టర్‌ కేఆర్‌పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు