భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట ఆలయం

6 Jun, 2022 01:21 IST|Sakshi
ప్రధానాలయంలో స్వామి వారి దర్శనానికి క్యూలైన్‌లో నిల్చున్న భక్తులు  

స్వామి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం 

రికార్డుస్థాయిలో రూ.50.89 లక్షల ఆదాయం 

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు పూర్తి అవుతుండటంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగున్నర గంటల సమయం, శీఘ్ర, అతి శీఘ్రదర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని 40 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

రికార్డు స్థాయిలో ఆదాయం.. 
ప్రధానాలయం ప్రారంభమైన నాటి నుంచి ఆదివా రం రికార్డు స్థాయిలో పూజలతో రూ.50,89,482 ఆ దాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.4,77,700, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,20,680, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,27,900, కొండపైకి వాహనాల ప్రవే శంతో రూ.4,50,000, సువర్ణ పుష్పార్చనతో రూ.1,66,800, పాతగుట్ట ఆలయంతో రూ.75,500, కల్యాణ కట్టతో రూ.76,600, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,00,000 వచ్చినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు