ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన

13 Sep, 2020 02:42 IST|Sakshi

10 వేలకు పైగా దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)కు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 2 నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా, శనివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 70,193 దరఖాస్తులు వచ్చాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంత అనూహ్యమైన స్పందన రావడం గమనార్హం. మున్సిపాలిటీల పరిధిలో 30,353, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 16,912, గ్రామపంచాయతీల పరిధిలో 22,928 దరఖాస్తులు వచ్చాయి. కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.7.12 కోట్ల ఆదాయం వచ్చింది. అనధికార, అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను చేయమని, ఇలాంటి లేఅవుట్లలో భవన నిర్మాణాలకు సైతం అనుమ తులు జారీ చేయబోమని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవ డం తప్పనిసరిగా మారింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్లు జరపడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అనుమతి లేని వ్యక్తిగత ప్లాట్ల యజమానులు, లేఅవుట్ల డెవలపర్లలో గుబులు పట్టుకుంది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకోవడానికి సామాన్యులతోపాటు డెవలపర్లు భారీసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు