శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం

1 Sep, 2021 10:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుషాపూర్‌లో ఘటన

రెండుసార్లు అంత్యక్రియలు చేసిన కుటుంబసభ్యులు

టేకుమట్ల: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్‌ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు.

కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్‌ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ)

చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి

మరిన్ని వార్తలు