సికింద్రాబాద్‌ విధ్వంసం.. సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్‌

18 Jun, 2022 20:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసంపై మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనలో ఒకరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు రైల్వే  ఆస్తి నష్టంపై జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ డీజీలను మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది.

కాగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులులు చేపట్టిన నిరసనలు అల్లకల్లోల్లాన్ని సృష్టించాయి. ఈ  అల్లర్లలో వరంగల్‌కు చెందిన రాకేష్‌ అనే ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి కూడా మరణించాడు.
చదవండి: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్‌

మరిన్ని వార్తలు