ESI Hospital-Shamshabad: గుడ్‌న్యూస్‌! శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆ‍స్పత్రికి కేంద్రం ఆమోదం

22 Feb, 2023 04:01 IST|Sakshi

కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్‌ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు.

దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ శివారులో గగన్‌పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్‌నగర్‌ పారిశ్రామిక వాడలకు శంషాబాద్‌ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్‌ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. 
(చదవండి: నో రూల్స్‌.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు)

మరిన్ని వార్తలు