దారుణం: కరోనాతో నిన్న భార్య, నేడు భర్త ..

2 May, 2021 12:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పర్వతగిరి(జయశంకర్‌ జిల్లా): వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి  చెందిన దంపతులు కరోనా బారిన పడి మృతి చెందారు. పది రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పర్వతగిరికి చెందిన వ్యక్తి(62) చౌరస్తాలో చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు.

ఆయన భార్య పది రోజుల క్రితం కరోనా బారిన పడగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా సోకగా, హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం మృతి చెందాడు. కాగా, ఈ దంపతులు పిల్లలు లేకపోవడంతో బంధువులే అన్నీ అయి అంత్యక్రియలు పూర్తిచేశారు.  

మరిన్ని వార్తలు