డిండి వాగులో చిక్కుకున్న దంపతులు

16 Sep, 2020 20:30 IST|Sakshi

సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు నీటిలో  చిక్కుకున్నారు.  సభావత్, వెంకట్ రాములు,అనే దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి, సీఎస్‌లతో మాట్లాడి వారిని రక్షించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెలికాప్టర్‌ను కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగులోనే చిక్కుకొని ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోనుంది. ('డిండి' దారెటు?)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు