భార్య కాపురానికి రావడం లేదని టవర్‌ ఎక్కిన భర్త

22 Aug, 2021 09:55 IST|Sakshi

సాక్షి, కడెం(ఆదిలాబాద్‌): భార్య కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు ఓ యువకుడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన సుతారి రవికి అదే గ్రామానికి చెందిన సౌజన్యతో సుమారు నాలుగేళ్ల క్రితం వివాహాం జరిగింది.

వీరికి రెండు సంవత్సరాల వయస్సు గల బాబు ఉన్నాడు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లగా ఇటీవలే మామతో గొడవపడ్డాడు. ఈక్రమంలో మనస్తాపం చెందిన రవి శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న సెల్‌ టవర్‌ ఎక్కి గంటపాటు హల్‌చల్‌ చేశాడు. చివరికి పోలీసులు, అతని మామ వచ్చి నచ్చజెప్పడంతో కిందకు దిగాడు.

చదవండి: విషాదం: గడ్డివాములో కుటుంబం అంతా ఆహుతి 

మరిన్ని వార్తలు