భార్య ఫిర్యాదు, ఆందోళనతో భర్త ఆత్మహత్యాయత్నం

28 Feb, 2021 14:26 IST|Sakshi

కుటుంబ కలహాలతో భర్తపై కేసు పెట్టిన భార్య 

ఆందోళనకు గురై భర్త ఆత్మహత్యాయత్నం 

కరీమాబాద్‌: భర్త తనను వేధిస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  ఆందోళనకు గురైన భర్త.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌లోని మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. ఏసీపీ గిరికుమార్‌ వివ రాల ప్రకారం.. వరంగల్‌ లేబర్‌ కాలనీకి చెందిన జి.వనజ– హరికృష్ణ మూడేళ్ల క్రితం ప్రేమ వివా హం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. హరికృష్ణ మద్యానికి బానిసై తరచూ భార్యను కొడుతూ వేధిస్తుండటంతో మిల్స్‌కాలనీ పోలీసులకు ఆమె ఇటీవల ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు విచారణ చేపట్టగా, ఆందోళనకు గురైన హరికృష్ణ శనివారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌ వద్దకు వచ్చి తనతో తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా, కానిస్టేబుల్‌ రఘుపతిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో హరికృష్ణకు తీవ్ర గాయాలు కాగా, అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  
(చదవండి: ప్రాణం తీసిన దీపం)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు