Photo Viral: వినూత్నం.. కోతులు ‘బేర్‌’మన్నాయి!

22 Mar, 2022 14:14 IST|Sakshi

కోహెడ రూరల్‌ (హుస్నాబాద్‌): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు.

కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం)

మరిన్ని వార్తలు