అయ్యయ్యో.. వద్దమ్మా! డబ్బులు తీసుకోం గానీ, సుపరిపాలనతోనే సుఖీభవ

4 Oct, 2021 10:00 IST|Sakshi

‘అయ్యయ్యో, వద్దమ్మా.. ఈ మధ్యనే ఓటు అర్హత వచ్చింది.. తొలిసారి ఓటు హక్కు వినియోగిస్తున్నా..డబ్బులు తీసుకోం గానీ,  సుపరిపాలనతోనే సుఖీభవ’ ఇదీ తొలిసారి టుహక్కు వచ్చిన యువత మనోగతం

సాక్షి, కరీంనగర్‌/హుజూరాబాద్‌: ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కు. పరిపాలకులను ఎంచుకునే అరుదైన అవకాశం అరుదుగా వస్తుంటుంది. అలాంటి వజ్రాయుధమైన ఓటును యువతకు బీరు, బిర్యానీ, క్రికెట్‌ కిట్లు, సెల్‌ఫోన్లు తదితర ప్రలోభాలను ఎరవేసి కొనేందుకు రాజకీయనాయకులు ప్రయత్నిస్తుంటారు. కానీ, తాము మాత్రం అలా కాదని నేటితరం యువత కుండబద్దలు కొడుతోంది. డబ్బు, ప్రలోభాలకు నేటియువత లొంగదని, సుపరిపాలన అందించేవారికి పట్టం కట్టడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.

ఇటీవల ఓటు హక్కు వచ్చిన కొందరు యువతను ‘సాక్షి’ కదిలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తొలిసారిగా తమకు ఓటు హక్కు వచ్చిందని, దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. సమర్థులు, ప్రయోజకులకే తాము ఓటేస్తామని చెప్పారు. ఓటు అనే వజ్రాయుధాన్ని సరిగ్గా వాడితే, అద్భుతాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో విధిగా ఓటు వేసే మధ్యవయస్కులు, సీనియర్‌ సిటిజన్లు కూడా నాయకుల తలరాతలు మార్చేది.. యువత ఓటింగే కీలకమని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు