ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. దారిలో షాకిచ్చిన వధువు ఫ్యామిలీ

25 May, 2023 15:09 IST|Sakshi

సాక్షి, హుజురాబాద్‌: ప్రేమపెళ్లి చేసుకున్న ఓ నవ వధువు సినీఫక్కీలో కిడ్నాప్‌కు గురైంది. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కొండగట్టులో ప్రేమ పెళ్లి చేసుకుని హన్మకొండ వైపుగా కొత్త జంట వెళుతోంది. కారును అడ్డగించిన 15 మంది.. వరుడిపై దాడి చేసి, వధువును తీసుకెళ్లారు.

వధూవరులిద్దరు హన‍్మకొండకు చెందినవారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెళ్లికూతురు బంధువులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల సమక్షంలోకి వధువును తీసుకురానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు