అమెరికాలో హుజూరాబాద్‌ వాసి మృతి

20 Jan, 2021 09:49 IST|Sakshi
నిఖిల్‌రావు (ఫైల్‌)  

ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

సాక్షి, హుజూరాబాద్‌: అమెరికా నుంచి వస్తాడని కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి పుత్రశోకమే మిగిలింది. అమెరికాలో హుజూరాబాద్‌ వాసి అనారోగ్యంతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హుజూరాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన పంబిడి జగన్‌మోహన్‌రావు-లక్ష్మిల ఒకగానొక్క కుమారుడు నిఖిల్‌రావు(29). ఎంఎస్‌ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. అతన్ని స్వగ్రామం రావాలని తల్లిదండ్రులు పలుమార్లు కోరారు.

కానీ హెచ్‌1బీ వీసా ఆలస్యమవడంతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో నిఖిల్‌రావు ఈ నెల 17న అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. అమెరికాలోని బంధువుల ద్వారా కుమారుడి మరణ వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అమెరికా నుంచి కొడుకు వస్తే వివాహం చెద్దామనుకున్నామని, కుమారుడు తమ వద్దే ఉంటాడని ఆశపడ్డామని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిఖిల్‌రావు మృతదేహం వారం రోజుల్లో స్వగ్రామం చేరనున్నట్లు బాధిత బంధువులు తెలిపారు.   

మరిన్ని వార్తలు