Hyderabad: టపాసులు కాలుస్తూ గాయాలపాలు.. సరోజినీ దేవి ఆస్పత్రికి జనం క్యూ

5 Nov, 2021 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి పండుగ పూట పలు చోట్ల అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా క్రాకర్స్ కాలుస్తుండగా గాయపపడిన వారి సంఖ్య పెరుగుతోంది. గాయపడిన వారంతా హైదరాబాద్​లోని సరోజనిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. దీపావళి రోజు బాణాసంచా కాలుస్తూ 31 మంది  పిల్లలు, పెద్దలు గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారికి చికిత్స చేసి ఇంటికి పంపించగా. తీవ్రంగా గాయపడిన నలుగురికి  సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  ఇద్దరికి ఆపరేషన్ అవసరమైంది.
చదవండి: భీతావహం.. పేలిన దీపావళి బాంబులు

చంద్రాయణగుట్టకు చెందిన రాజ్‌ తివారి అనేవ్యక్తి ఏకంగా కన్ను కోల్పోయాడు. దీంతో దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లేదా అవిటివారు కావాలిస​ వస్తుందని సరోజినీదేవి వైద్యురాలు కవిత హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులే ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు