అమ్నీషియా పబ్‌ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్‌ మంజూరు

27 Jul, 2022 15:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమ్నీషియా పబ్‌ రేప్‌ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్‌ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్‌ ఖాన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్‌ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్‌ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్‌ మంజూరు చేసింది. కాగా జువైనల్‌ హోమ్‌లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్‌ వచ్చింది.

సుమారు ఘటన జరిగిన 48 రోజుల తర్వాత ఈ  కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు  బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికే నలుగురు బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్‌ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక రేప్‌ కేసులో పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. 
చదవండి: రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్‌

మరిన్ని వార్తలు